ఆ తెల్లవారుజామున అర్జున్ కళ్ళు నిద్రకు నోచుకోలేదు. తన క్యాబిన్‌లోని వైట్ బోర్డు మీద ఇప్పుడు ఆ వైరల్ వీడియో స్క్రీన్ షాట్‌లు, నిన్న రాత్రి అతను ఫోన్లో తీసిన ఆ వంగిపోయిన ఇనుప రేక్ ఫోటోలు పిన్ చేసి ఉన్నాయి. ఆ గదిలో నిశ్శబ్దం అలుముకున్నా, అర్జున్ మెదడులో మాత్రం వేల ప్రశ్నలు యుద్ధం చేస్తున్నాయి.టార్చ్ లైట్ వెలుతురులో వేద కళ్ళు రంగు మారడం.. ఒక సాధారణ అమ్మాయి తన అరచేతి స్పర్శతో మందపాటి ఇనుమును వెన్నలా వంచేయడం.. ఇవన్నీ ఒక మనిషికి సాధ్యమేనా?"ఇదేదో మెడికల్ కండిషన్ అని తను నమ్మించాలని చూస్తోంది. కానీ ఆ కళ్ళలో ఉన్నది జబ్బు కాదు.. ఒక రకమైన అపరిమితమైన శక్తి. అసలు తనెవరు? ఆ శక్తికి మూలం ఎక్కడ ఏంటి?" అని అర్జున్ తనలో తాను గొణుక్కున్నాడు. ఆ ఇనుప రేకు మీద ముద్రించబడిన వేలి ముద్రలను జూమ్ చేసి చూస్తున్నప్పుడు అతనికి ఒకటి అర్థమైంది. అది కేవలం