తుఫానులా కురుస్తున్న భారీ వర్షం బస్సు అద్దాలను తడుపుతోంది. బయట ప్రపంచం మసక మసకగా కనిపిస్తుంటే, లోపల కూర్చున్న వేద మనసులో మాత్రం అంతకంటే పెద్ద తుపాను చెలరేగుతోంది.తలకు ముసుగు వేసుకుని, బస్సు మూలలో నక్కి కూర్చున్న ఆమెకు.. పక్కన ఉన్న ప్రతియొక్క ప్రయాణీకుడి చూపు తనపైనే ఉందేమో అన్న భయం వేధిస్తోంది."బస్సులో ఉన్నవాళ్లు కూడా నన్ను గుర్తుపట్టే లోపల నేను వెళ్ళిపోవాలి.. నా లోపల నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ మంట నన్ను, నాతో పాటు ఈ సమాజాన్ని కూడా హానికరం." ఇలాంటి ఆలోచనల భయంతో, తనను తాను అదుపు చేసుకుంటూ జాగ్రత్తగా ఒకమూల కూర్చుంది.బస్సు అద్దం మీద తన ప్రతిబింబాన్ని చూసుకున్న వేదకు ఒక క్షణం వణుకు పుట్టింది. "నా కళ్ళు మళ్ళీ ఎర్రబడుతున్నాయా? లేదు.. ఇది కేవలం నా భ్రమ మాత్రమే." కానీ ఆ భయం ఆమెను నీడలా వెంటాడుతూనే ఉంది.హఠాత్తుగా ఒక పెద్ద కుదుపుతో బస్సు ఆగిపోయింది.