ఎవరో అజ్ఞాత వ్యక్తి నుండి వేదకు వచ్చిన మెసేజ్ చూసి ఆమె స్తంభించిపోయింది. ఎవరో తనను గమనిస్తున్నారనే అనుమానం తనలో మొదలైంది. వెంటనే పైకి లేచి అటూ ఇటూ చూస్తూ, కిటికీ దగ్గరకు వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో అని గమనించింది. కానీ ఎవరూ లేరు. ఒకవేళ తన గురించి ఎవరికైనా నిజం తెలిసుంటే అనే ఊహ కూడా ఆమె తట్టుకోలేక పోయింది. రేపు కాలేజీలో ఇంకేం జరగబోతుందో అని భయపడుతూనే చింతలో ఉండిపోయింది.మరుసటి రోజు ఉదయం, కాలేజ్ గేటు దాటకముందే, అక్కడి వాతావరణాన్ని చూసి వేదకు ఆ రోజు పరిస్థితి అర్థమైపోయింది. నిన్నటి వరకు తనను కనీసం పలకరించని జనాలు, అస్సలు తెలియని ముఖాలు.. అందరూ ఇప్పుడు అక్కడ గుమిగూడి ఉన్నారు. ముఖానికి గురిపెట్టిన సెల్‌ఫోన్ కెమెరాలు, టీవీ ఛానెళ్ల మైకులు ఆమెను చూసి ఒక్కసారిగా మీద పడ్డాయి."వేద! ఆ వీడియోలో ఉన్నది మీరేనా? మీ శరీరం మరియు కళ్ళు అలా ఎలా మారుతున్నాయి?""మీరు డ్రగ్స్ ఏమైనా