అఖిరా – ఒక ఉనికి కథ - 2

ఎపిసోడ్ – 2అఖిరా హాస్పిటల్ కి చేరుకుంది.కంగారుగా రిసెప్షన్ లో ఇలా అడిగింది –“ఎక్స్క్యూస్ మీ, ఎక్స్క్యూస్ మీ మామ్… పేషెంట్ పేరు సువర్ణ. అడ్మిట్ అయ్యారు. ఏ వార్డ్ లో ఉన్నారు?” అని అడిగింది.రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి,“పైన ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నంబర్ 4 లో చూడండి,” అని చెప్పింది.అఖిరా, “ఓకే, థ్యాంక్స్,” అని చెప్పి పరుగెత్తింది.డోర్ తేసి చూసింది — సువర్ణ పడుకుని ఉంది, పక్కనే నిక్కి కూర్చుంది.అఖిరా, “నిక్కి, పిన్నికి ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగింది.నిక్కి, “అక్కా, ఇప్పుడు పరవాలేదు. మళ్లీ అదే ప్రాబ్లం… కిచెన్ లో పని చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఈరోజు టెస్ట్ క్యాన్సిల్ అయ్యిపోయింది. ఇంటికి తొందరగా వచ్చాను. అమ్మని అలా చూడగానే వెంటనే హాస్పిటల్ కి తీసుకువచ్చా,” అని చెప్పింది.అఖిరా కొంచెం రిలాక్స్ అయ్యింది.“సరే, ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అన్నారు డాక్టర్?” అని అడిగింది.నిక్కి, “ఇప్పుడే డ్రిప్స్