అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో గోవిందుడు అనే రైతు ఉండేవాడు. ఎంతో కష్టపడి పని చేసి, 200 అవులు కొనుగోలు చేసి, అడవిలో మేపుతూ జీవించేవాడు. ఆయన భార్య లక్ష్మి, వారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు.గోవిందుడు మొదటి ఇద్దరు కొడుకులను చదువుకోనివ్వలేదు. మిగతా ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలను మాత్రం పాఠశాలకు పంపేవాడు. మొదటి కొడుకు పని చేయాలంటే బద్ధకస్తుడు, కానీ రెండవ కొడుకు భట్టు మాత్రం పగలంతా కష్టపడి పని చేసి, సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు.కొంతకాలం తర్వాత, ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు జరిగాయి. కానీ భట్టుకు పెళ్లి అయినా, కష్టాలు మాత్రం తగ్గలేదు. లక్ష్మి గారు మిగతా పిల్లలతో ఒకలా, భట్టుతో మాత్రం మరోలా వ్యవహరించేది.ఒకరోజు, భట్టు భార్య మంగీ ఆరోగ్యంగా లేకపోవడంతో, ఆసుపత్రికి తీసుకెళ్లాలని అడిగాడు. కానీ గోవిందుడు, లక్ష్మి గారు "ఇది అంతా నాటకం, పని చేయకుండా తప్పించుకోవడం" అని అనేశారు. ఆ రోజు