మౌనిక tension పడుతూ ఉండడం గమనించిన నాని "అలాంటి వాళ్ళకి ఎంతో మంది శత్రువులు ఉంటారు, ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడుచేసుకోకండి" అని మౌనిక వైపు చూసి "వెళ్దామా"? అన్నాడు. మౌనిక రెండు క్షణాలు నాని వైపు చూసి silent గా బయటకు వెళ్తుంది. "సరే రా మీరు collage కి వెళ్ళండి, మేము temple నుంచి Direct గా collage కి వచ్చేసాం" అంటూ మౌనిక వెనుక నడుస్తూ వెళ్ళాడు నాని.వెంకటేశ్వరస్వామి ఆలయం శనివారం కావడంతో భక్తులతో నిండిపోయిన వెంకటేశ్వరస్వామి ఆలయం ముందు scooter ఆపాడు నాని, మౌనిక కిందకి దిగింది. నాని scooter park చేయడానికి వెళ్తూ "నువ్వు వెళ్తూ ఉండు నేను పార్కింగ్ లో పెట్టి వస్తాను" అని పక్కనే ఉన్న పార్కింగ్ place లో scooter park చేసి, తన ముందు నడుస్తున్న మౌనిక వైపు వెళ్ళాడు. ఇద్దరూ కాళ్ళు కడుక్కుని ఆలయంలోకి వెళ్తున్న సమయంలో మౌనిక, నాని చేయి పట్టుకుని