ఓ మౌన ప్రేమ గాధ సిద్ధు అనే అబ్బాయి చిన్నప్పటి నుంచే చాలా అమాయకుడు, తెలివైనవాడు. అతని తల్లి దండ్రులు అతని చదువులో ఉన్న ఆసక్తిని గమనించి, మూడవ తరగతిలోనే బెంగళూరు నగరంలోని ఒక నావోదయ పాఠశాలలో చేర్పించారు. అక్కడ అతను హాస్టల్‌లో ఉండి ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నాడు. చిన్న వయస్సులోనే ఇంటి నుంచి దూరంగా ఉండటం అతనికి కొత్త అనుభవం. కానీ అతని తెలివితేటలు, నిశ్శబ్దంగా గమనించే స్వభావం వల్ల అతను త్వరగా అలవాటు పడిపోయాడు.నవవ తరగతికి వచ్చేసరికి, అతని తల్లి దండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నిర్ణయించారు. ఆ పాఠశాల అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకునే పాఠశాల. సిద్ధు చిన్నప్పటి నుంచీ అబ్బాయిలతోనే కలసి ఉండటం వల్ల, అమ్మాయిలతో మాట్లాడటం అతనికి కాస్త సంకోచంగా అనిపించేది. అతను వాళ్లతో మాట్లాడాలా వద్దా అనే ఆలోచనల మధ్య కాలం గడిపేవాడు.ఒక సంవత్సరం గడిచింది. పదవ తరగతిలోకి అడుగుపెట్టిన