తనలో సగమైన తన సతి చిటికిన వేలు పట్టుకొని తన ఇంటి ముందు కారు దిగుతాడు "పదిహేడు సంవత్సరాల అర్జున్ " పెళ్లి కొడుకు బట్టలలో... అతని వెంటే కారు దిగి ఆశ్చర్యం గా చూస్తుంది ఆ ఇంటి నీ "పదహారు సంవత్సరాల వాహిని "పెళ్లి కూతురు ముస్తాబులో .... రాజమహల్ నీ తలపిస్తున్న ఆ భవనం!!మైన్ గేట్ నుండి వంద అడుగుల దూరంలో ఉన్న ఆ ఇంటికి!! చుట్టూ పచ్చని చెట్లు, పూల మొక్కలు!! ఇంటికి ఎడమ వైపు భాగం లో స్విమ్మింగ్ పూల్ దానికి కొంచం దూరం లో పని వాళ్ళ క్వార్టర్స్!! ఇంటి ముందు పెద్ద పౌంటెన్ లో కృష్ణుడి విగ్రహం!! ఇంటి పోర్టికోలో ఆగిన పది కార్లు వాళ్ళు ఎంతటి సంపన్నులో చెప్తున్నవి.. అలాంటి ఇంటిని తన తేనెలూరే కళ్ళతో అద్భుతాన్ని చూసినట్టు చూస్తది వాహిని ..