నా మనసు నీ కోసం -3

అన్విత చాలా అందంగా రెడీ అవుతుంది. ఆకుపచ్చ రంగు చీరలో ఆమె మరింత తేజస్సుతో మెరిసిపోతోంది. అప్పుడే కిరణ్ అక్కడికి వచ్చి, "అక్కా, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు తెలుసా?" అని ప్రశంసించాడు."అవునా? థాంక్స్ రా," అన్విత నవ్వింది."అక్కా, ఫంక్షన్‌కి స్వప్న కూడా వస్తుంది," కిరణ్ చెప్పాడు."అవునా? సరే అయితే," అన్విత అంది. "రెడీ అయిపోయా. స్కూల్‌లో కొంచెం ప్రిపరేషన్స్ ఉన్నాయి, వెళ్తాను," అంది."సరే అక్కా, నేను కూడా వస్తాను," అన్నాడు కిరణ్."అమ్మా, బై. వెళ్తున్నాం," అని అన్విత తల్లికి చెప్పింది."హ్మ్మ్, నైట్ లేట్ అవుతుందిగా, జాగ్రత్తగా రా. కిరణ్‌తోనే రా," తల్లి సునీత ఆందోళనగా చెప్పింది."సరే అమ్మా, వెళ్లొస్తా," అని ఇద్దరూ బయలుదేరారు.కారులో రౌద్రవర్మ కుటుంబం..."ఎలా ఉంది హేమూ, హాస్పిటల్? ఏమైనా డబ్బులు అవసరమవుతాయా?" రౌద్రవర్మ తమ్ముడిని అడిగాడు."వద్దు అన్నయ్యా, సరిపోతాయి. హాస్పిటల్ బాగా రన్ అవుతోంది," హేమంత్ అన్నాడు."నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి స్వప్నా? బాగా చదువుకుంటున్నావా?"