ప్రేమా, ఆకర్షణ.. నిజం, నీడ లాంటివి... ఆకర్షణ అనే నీడని చూసి అదే ప్రేమ అనే నిజం అనుకుంటే ఎలా? ఏదో ఒక క్షణం... నీడ ఒంటరిని చేసి వెళ్ళిపోతుంది... నిజం మనల్ని చూసి జాలి పడుతుంది.వెల్తురులో మాత్రమే తోడుండే నీడ ... చీకటిని చూసి భయపడినట్టు... దూరాన్ని చూసి కలిగిన ఆకర్షణ... దగ్గర అవుతున్న కొద్ది తరిగిపోతుంది. ********************సిడ్ పార్కింగ్ వైపు వెళ్ళడం చూసి తనతో మాట్లాడడానికి అందరికన్నా ముందు సైకిల్ దగ్గరకి వచ్చేశాను. క్లాస్ ఉన్నా సరే కొంచెం బాలేదు అనే సాకు చెప్పాల్సి వచ్చింది. "సిడ్... సిడ్.... " నా మాటలు వినిపించినట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఇంక వెనక పరిగెత్తలేక ఆగిపోయాను ... ఆయాసంతోనా ఊపిరి శబ్దం వినిపించిందో ఏమో... ఆగి వెనక్కి చూసాడు. ఆయాస పడుతున్న నా దగ్గరకి వచ్చి బ్యాగ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఇచ్చాడు. "ధీర .. క్లాసెస్ వదిలేసి ఎందుకు వచ్చావ్.... కాల్ చేసుంటే సరిపోయేదిగా.."