ఆదిత్య (జాంబీ ఎంపరర్‌గా) ఉన్నంతవరకు పెద్ద సమస్య లేకుండా జాంబీలు కొంత కంట్రోల్‌గా ఉన్నాయి. అయితే, ఒకసారి వాటి ఆకలి పెరిగి, ఆదిత్య కనిపించకపోతే మాత్రం విధ్వంసం తప్పదని అందరికీ తెలుసు.పూజ ప్రభావం – ఆదిత్య బంధీ, జాంబీల నియంత్రణ కోల్పోవడంఅదే టైంలో, సిద్ధార్థ మహర్షి చేసిన పూజ సక్సెస్ అయ్యింది. కాళీమాత కళ్ళల్లో నుంచి ఒక నల్లటి కాంతి విడుదలవుతూ, ఆదిత్య శరీరంలోకి చేరిపోతుంది (అది జగదీష్ శరీరం కదా). ఆ శరీరంలో నుంచి రెండు ఆత్మలు బయటికి వస్తాయి – ఒకటి నల్లటి ఆత్మ, మరొకటి ఎర్రటి ఆత్మ (ఆదిత్యతో). ఆ నల్లటి ఆత్మ ఎవరిది? అది ఒక్కసారిగా ఎక్కడికో మాయమైపోతుంది.ఎప్పుడైతే ఆదిత్య, కాళీమాత దగ్గర నుంచి వచ్చిన వెలుగును తాకగానే, ఆదిత్య ఒక బాటిల్‌లో బంధించబడతాడు. అంతే! విధ్వంసం మొదలైంది! జాంబీలు తలలు పట్టుకొని కింద గిలగిలా కొట్టుకుంటూ, ఒక్కసారిగా లేస్తాయి. వాటి కళ్ళు విచిత్రంగా ఉన్నాయి