మన్నించు - 9

  • 429
  • 96

ప్రేమ వ్యక్తి పైనా? వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పైనా? ... వ్యక్తిని చూసి పుట్టిన ప్రేమ ఐతే తన కన్నా కళ్ళకు ఆకర్షణగా ఇంకొకరు కనిపిస్తే ప్రేమ వాళ్ల మీదకు మారుతుందా? .... వ్యక్తిత్వం పైనే ఐతే అదే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎందరో తరసపడతారు కదా, ప్రేమ వాళ్ల మీదకు మరుళ్ళుతుందా?వ్యక్తిని కాక వ్యక్తిత్వాన్ని కాక ఇంకేమైనా కారణం చేత ప్రేమ పుడితే .... ఆ కారణం ఏం అయ్యుంటుంది అంటారు? పిచ్చి మనస్సు... సమాధానం తెలిస్తే అస్సలు ప్రేమలో ఎందుకు పడుతుందిలే ....................************"ధీర... ఇంత రాత్రి మీద ఒకదానివే వచ్వావు ఎమ్మా" షాప్ నుంచి వెనక్కి వస్తున్న దారిలో నాన్నగారు కనిపించి బండి మీద ఎక్కించుకొని వెనక్కి తీసుకెళ్లారు.బండి మీద అస్సలు ఏమి మాట్లాడలేదు. ఇంటికి వెళ్లగానే అమ్మని వెతుక్కుంటూ గబగబా కిచెన్లోకి వెళ్ళిపోయారు. హాల్ లోకి వినిపిస్తున్నాయి మాటలు. "ఎదిగిన పిల్లని ఎందుకు ఒంటరిగా పంపిస్తున్నావ్?""ఎందుకు అండి.. ఇప్పుడు అంత కోపం....ధీర......" కుక్కర్