జాంబి ఎంపరర్ (The Zombie Emperor)సుమంత్ ఇల్లు – రాత్రి (కొనసాగింపు)మీనాక్షి సుమంత్‌ను దగ్గరికి తీసుకుని, కళ్ళల్లో నీళ్ళు నింపుకుని, "చెబుతాను రా... ఇన్నాళ్ళూ ఎవరికీ తెలియని నా గతాన్ని నీకు చెబుతాను..." అని అంటూ కథ చెప్పడం మొదలుపెట్టింది.ఆదిత్య యొక్క గతం (ఫ్లాష్‌బ్యాక్)అప్పుడే అక్కడ ఆగిపోయిన ఆదిత్య కథ కూడా మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి చెప్తారు. "ఇదే ఊరు మా మొదటి పరిచయం!" అని.ఆదిత్య గట్టిగా నవ్వుతూ, "ఏంట్రా! మా ప్రేమలో ఒక్క అడుగు... నీ పాపం! ఆ ఒక్క అడుగుతో మా జీవితాలను నాశనం చేశావు! మేమిద్దరం కలుసుకున్నది మొదటిగా..."రెండు కథలు ఒకేసారి, ఒకే ప్రవాహంలో సాగుతాయి, ఇద్దరు ఒకేసారి చెప్తున్నట్టుగా:"రంగనాధపురం!"రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ – రంగనాధపురం – అడవి – ఉదయం 6:00AMఅడవిలో ఏదో భీకరమైన శబ్దం. కరెక్ట్‌గా 6:00 సమయం.బలమైన శరీరంతో, పంది మాంసాన్ని తన భుజాన వేసుకొని గట్టిగా నడుస్తూ