పాణిగ్రహణం - 7

  • 309
  • 117

ఆ లెటర్ చదివిన సత్యవతి, శేషగిరి గారికి కన్నీరు ఆగడం లేదు.  ఎంత పని చేసావు అవిని అని బాధపడతారు.    హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయి మాస్క్ పెట్టుకుని కూర్చుంది.  తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి తలపై నుంచి కూడా స్కార్ఫ్ కట్టుకుంది.     ఫుల్లుగా కవర్ అయ్యే విధంగా డ్రెస్ వేసుకొని ఉంది. చాలా టెన్షన్ తో తన ఎక్కాల్సిన ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంది.  కొంచెం సేపటికి తను ఎక్కాల్సిన ట్రైన్ రాగానే స్పీడ్గా వెళ్లి ట్రైన్ ఎక్కి కూర్చుంది.  తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని చాలా జాగ్రత్తలు తీసుకుని ట్రైన్ ఎక్కేసింది.   జైసింహ మాన్షన్.....      పొద్దుటే శిల్ప రూమ్ డోర్ నాకు చేసిన సౌండ్ వస్తుంది. మత్తుగా  నిద్రపోతున్న శిల్ప కు ముందుగా సౌండ్ వినిపించదు.      ఇంకా కొంచెం గట్టిగా కొట్టిన తర్వాత ఉలుక్కుబడి లెగుస్తుంది.  ఏంటి