విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడు. ఫ్యామిలీ మొత్తం కూడా హాల్లోనే ఉంటారు. కానీ... అందరూ సైలెంట్ గా ఉంటారు. విక్రమ్ వచ్చి ఏమైంది ఇప్పుడు?? ఏం చేయాలో నాకు తెలుసు. ఇదే ఆలోచిస్తూ అందరూ టైం వేస్ట్ చేసుకోకండి అని చెబుతాడు. అప్పుడే గుమ్మం ముందు కారు ఆగుతుంది. ఎవరి వచ్చి ఉంటారో అర్థమయ్యే లేని నవ్వుని తెచ్చుకుని లలిత, మాధవి ఎదురు వెళ్లి స్వాగతం చెబుతారు. ధనుంజయ్ ఫ్యామిలీ గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. శిల్ప ముసుగులోనే ఉంటుంది.ఇందిరా గారు లలితని పిలిచి కోడలకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురామనీ చెబుతారు.లలిత హారతి ఇచ్చి. లోపలికి తీసుకువస్తుంది. అందరికీ మర్యాదలు చేస్తారు. శిల్ప కి చాలా టెన్షన్ గా ఉంటుంది. విక్రమ్ ఫేసులో ఎటువంటి ఫీలింగ్స్ కనపడవు. అసలు ఏం జరుగుతుందా అని...హాల్లో అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం