పాణిగ్రహణం - 3

  • 219
  • 66

  శిల్ప, విక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ టెన్షన్తో చేతులు రెండు లాక్ చేస్తుంది.. శిల్ప టెన్షన్ చూసి విక్రమ్ హే జస్ట్ రిలాక్స్,  ఇక్కడ ఉన్నది మనిద్దరమే.   భార్యాభర్తలు అంటే వేరు, వేరు కాదు ఒకటే అని మా గ్రానీ ఎప్పుడూ చెబుతూ ఉండేది.   మా ఇంటి ఆచార ప్రకారం ఈరోజు జరిగే కార్యం వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదు. ప్రజెంట్ జనరేషన్ లో ఫోటో కూడా చూడకుండానే పెళ్లి చేసుకుంది మనమే అయి ఉంటాం. మన ఆచారాలు మనం పాటించాలి కదా! అని చెబుతూ ఉంటే ముసుగులో నుంచే శిల్ప విక్రమ్ చూస్తూ ఉంటుంది.     విక్రమ్,  శిల్పతో బాక్స్ ఓపెన్ చేసి చూడవా నేను ఇచ్చినవి  అంటే... శిల్ప కంగారుగా బాక్స్ ఓపెన్ చేస్తుంది.   ఆ గిఫ్ట్ ని పట్టుకుని చూస్తూ ఉంటుంది.  ముసుగులో ఉన్న శిల్ప భావాలు అర్థం కాక... నచ్చిందా అని అడుగుతాడు.    శిల్ప