పాణిగ్రహణం - 1

  • 192
  • 57

ఈ కథ పూర్తిగా కల్పితం..కళ్యాణ మండపం...ఈ సిటీ లోనే పెద్ద పెద్ద బడా బాబుల్ని భరించే అతిపెద్ద కళ్యాణ మండపం.రాష్ట్రంలోనే రెండు పెద్ద బిజినెస్ కుటుంబాల మధ్య జరుగుతున్న వివాహ వేడుక ఇది.అంగరంగ వైభవంగా అలంకరించి ఉంది ఎటు చూసినా రెండు కుటుంబాల వైభోగం కనబడుతుంది.కళ్యాణ మండపం చుట్టూ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది.ప్రతి ఒక్కరినే బాగా చెక్ చేసి గాని లోపలికి పంపడం లేదు.        పెళ్ళికొడుకు మండపంలో కూర్చుని వర పూజ చేస్తున్నాడు. పెళ్ళికొడుకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.  ఆరడుగుల అందగాడు, చురకత్తుల లాంటి చూపులు, సమ్మోహనపరిచే చిరునవ్వు, సిల్కీ హెయిర్, చుక్కల్లో చంద్రుడు వలె మెరిసిపోతున్నాడు.    పెళ్లికి వచ్చిన బంధువు వర్గం అంతా ఈ సంబంధం మాకు ఎందుకు కుదరలేదు అని బాధపడుతూ, పెళ్లికూతురు తండ్రి అదృష్టానికి ఈర్షపడ్డారు .  పెళ్ళికాని అమ్మాయిలు అయితే తమ కలల రాకుమారుడు వేరొకరి సొంతం అవుతున్నందుకు తెగ బాధ