ముగింపు...తల్లి అడిగినట్టు లోపలికి తీసుకొచ్చి లీల గదిలో వదిలి బయటకు వెళ్లారు బసవయ్య. సగానికి సగం అయిపోయి ఎముకల గూడులా మారిన మనవరాలిని కన్నీళ్ళతో చూస్తూ నెమ్మదిగా చీర చెంగున దాచిన లీల జ్ఞాపకాల పుస్తకాన్ని బయటకు తీసి తన గుండెల మీద పెట్టారు. గుండెల మీద బరువుగా అనిపిస్తుంటే కళ్ళు తెరిచి చూసింది లీలా. అప్పటికే గడప దాటి కర్ర సాయంతో బయటకు వెళ్ళిపోతున్నారు ఆండాలమ్మ.బామ్మ గారిని చూస్తూ గుండెల మీద చేయి పెట్టి తడుముకున్న లీలా చేతికి పుస్తకం దొరకడంతో... అది అదేనా అని ఆత్రంగా తడిమి చూస్తున్న లీల ముఖంలో కన్నీళ్ళతో కూడిన నవ్వు. అప్పుడే కొత్తగా ఊపిరి పోసుకున్నట్టు అనిపిస్తున్న గుండెతో గట్టిగా ఏడుస్తూ పుస్తకాన్ని గుండెలకి హత్తుకున్న లీల లో ఆ క్షణమే తిరిగి ప్రేమ మళ్ళీ ప్రాణం పోసుకుంది. ఎంతసేపు అలా పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని ఏడ్చిందో గుమ్మం దగ్గర నిలబడి విన్న బామ్మ గారికే మాత్రమే తెలుసు.నెమ్మదిగా పెరటి