ప్రేమలేఖ..? - 7

  • 471
  • 144

తిరిగి కొట్టడం వాళ్ళ నోర్లు ముయించడం క్షణం పని ఆనంద్ కి. ప్రేమించిన పిల్ల కోసం తన కుటుంబానికి ఇస్తున్న గౌరవంతో ఆ పని చేయలేక నిలబడి మాట్లాడుతున్నాడు. ఇంకోసారి నా కూతుర్ని కలవడానికి ప్రయత్నించావు నిన్ను అక్కడే చంపి పాత్ర వేస్తా నా ఇంటి చుట్టుపక్కలే కాదు అసలు ఊర్లోనే ఉండడానికి వీలు లేదు అని శాసించినట్టే అన్నారు బసవయ్య గారు. ఊర్లో ఉండదుద్దు అని చెప్పే హక్కు మీకు ఎవరు ఇచ్చారండి ముందు మీ అమ్మాయి మనసులో ఏముందో కనుక్కోండి..??ప్రేమ కోసం ప్రాణం మిదకు తెచ్చుకున్న మీ కూతురి కష్టం కనిపించడం లేదా మీకు??  అని సుభాషిని గారు నిలదీస్తుంటే ఆండాలమ్మ గారు అడ్డుపడ్డారు. గట్టిగా చివాట్లు పెట్టి ఆనంద్ ని తీసుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపొమ్మని పెద్ద గొడవే చేశారు.కన్నీళ్లతో ఏడుస్తూ అన్నందుకు కోసం అల్లాడిపోతున్న లీలలను పూర్ణేశ్వరి గారు గట్టిగా పట్టుకొని ఆపుతున్నారు తోడుగా పెద్ద కోడలి సాయంతో. కళ్ళ ముందు