నాలుగు రోజులకు లీల కు జ్వరం తగ్గింది, వారానికి కాస్త లేచి తిరుగుతుంది కానీ మనిషి ఇది వరకులా లేదు. ఆనంద్ దూరంగా ఉన్న చిన్ననాటి నుంచి భద్రంగా దాచుకున్న ఆ జ్ఞాపకాల సావాసంతో రోజులు గడిపేస్తున్నారు ఇప్పుడు అది కూడా దూరం అవ్వడం.. భరించలేక పోతుంది. ముఖ్యంగా ఆనంద్ ఇచ్చిన ప్రేమలేఖ. కనీసం ఓపెన్ చేసి కూడా చూడలేదు. నీ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ నువ్వు దానిని ఎలా నాకు చెప్తావో తెలుసుకోకుండానే పోగొట్టుకున్నాను. నీతో బ్రతుకులేని నేను నీ జ్ఞాపకాలతో బ్రతికే అర్హతను కూడా కోల్పోయాను అని తనలో తానే తలడిల్లిపోతున్న లీల నెమ్మదిగా కృశించిపోతుంది.రోజులు అందరికీ మామూలుగానే నడుస్తున్నాయి. లీలాకు మాత్రం చాలా కష్టంగా భరించలేనంత భారంగా క్షణాలు కదులుతున్నాయి. అదంతా అండలమ్మ గారికి తెలిసిన కఠినంగా ఉంటే మార్పు సాధ్యమని లీల కన్నీళ్లను చాటుగా గమనిస్తూ ఉండిపోయారు. ఒకరోజు సాయంత్రం బయటి నుంచి వచ్చిన బసవయ్య గారు అరుగు