ప్రేమలేఖ..? - 5

ఇల్లు దాటి బయటికి రాని లీల మీద ఆండాలమ్మ గారి అజమని చాలా కష్టంగా అనిపించింది ఆనంద్ కి.ఒకరోజు చూడడానికి ఇంటికి వచ్చాడు. గుమ్మంలోనే నిలబెట్టి మనవరాలు లేదని ఇంకోసారి రావద్దని అరిచి పంపిస్తుంది ఆండాలమ్మ. అది తెలిసిన ఆనంద్ ఫాదర్ రంగనాథ్ గారు కొడుకుని నిలదీశారు. ఆనంద్ తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఆండలమ్మ గారు ఒప్పుకోరుడా ఆవిడ మాట కాదు నివాళింట్లో ఎవరు కూడా ఏదీ చేయరు. దేవుడు ఉన్నాడని ఎంత బలంగా మనం నమ్ముతామా అనాది నుంచి వస్తున్న ఆచారాలు కట్టుబాట్లను వాళ్ళు అంత బలంగా నమ్ముతారు.నువ్వు ఊర్లో ఉన్నంతవరకు లీలా అలా పంజరంలో పక్షులానే ఉండాలి. నిర్ణయం నీకే వదిలేస్తున్నా అని తండ్రి చెప్పడంతో శుక్రవారం సాయంత్రం గుడికి వచ్చిన లీలా అని ఎవరు చూడకుండా కలిసి సిటీకి వెళ్తున్న విషయం చెప్పాడు ఆనంద్. బామ్మ తిట్టినందుకు సారీ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది లీలా.నేను మా నాన్నగారికి చెప్పాను మా