ప్రేమలేఖ..? - 2

  • 234
  • 78

తన ప్రమేయం లేకుండానే సన్నగా వణికి పోతుంది లీలా.తలుచుకుని బ్రతకడానికి మనకి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నపిల్లలం కాదు లీలా.. అలా అని ఎవరిని బాధ పెట్టాలని నాకు లేదు. ఇంకా నిన్ను దూరం చేసుకొని నరకం భరించే శక్తి కూడా నాకు లేదు.ఇది నా మనసు తీసుకో..  నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను అని కచ్చితంగా చెప్పిన అతని మాటలకి వణుకుతున్న చేతితో పేపర్ కవర్ అందుకుంది లీలా.నిమిషాల క్రితం నీరెండలో బంగారు బొమ్మలా మెరుస్తున్న ఆమె రూపం ఇప్పుడు మక్కెన పువ్వులా అలసిపోయిన ఎరుపు రంగులో కనిపిస్తుంటే చాలా కష్టంగా ఉంది ఆనంద్ కి.ఏమన్నా చెప్పాలా అని చిన్న గొంతుతో ఆర్థిగా ఆమెనే చూస్తూ అడిగాడు.జీవిత కాలానికి సరిపడా చెప్పాలన్నంత ఆశ అయితే గుండె నిండుగా ఉంది. పెద్దవాళ్లని ఎదిరించి అడుగు ముందుకు వేయలేని కట్టుబాటుకు లోంగిన ఆమె.. పెదవి కదపలేదు.చిన్నగా తల మాత్రమే అడ్డంగా కదుపుతూ ఆనంద్