ప్రేమలేఖ..? - 1

  • 336
  • 90

సున్నితమైన చిన్న ప్రేమ కథ.   అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. చదివి మీ అభిప్రాయం కామెంట్స్ లో ఇవ్వండి.మీకు నచ్చితే మరిన్ని కథలను అందిస్తాను.. ఇట్లు మీ వర్ణ.అది ఒక చిన్న గ్రామం.పరువు ప్రతిష్ట లకు ప్రాణం ఇచ్చే పౌరుషాలు, కులము, మతము, కట్టుబాట్లు, ఆచారాలు ఇంకా పొలిమేరలు దాటని గ్రామం. కంటికి కనిపించని కంచెలతో గీతలు గీసుకుని, గడపలలో మడికట్టుకు తిరిగే పెద్ద వాళ్లకు పేరుగాంచిన గ్రామం.వదిలేసి ఎగిరి పోలేని ఒక ఆడపిల్ల మనసును కట్టటి చేస్తున్న గ్రామం. తెగించి తీసుకుపోలేని ఒక మగవాడి పౌరుషాన్ని ప్రశ్నిస్తున్న గ్రామం. అన్నిటి నడుమ కదిలిపోతున్న ఓనాటి సాయంత్రం..నిమ్మ పండు రంగులో మెరుస్తున్న వేసవి సాయంత్రం. పచ్చటి పొలాల మీదా, గుడిసెల మీదా ఆ కాంతి వెదజల్లుతూ, ముద్దుగా తాకుతుంది. చుట్టూ పూల వాసన, ఆకుల మర్మరాలు గాలిలో తేలుతూ ప్రేమను, తపనను నింపుకున్న గుండెకి వాటి సవ్వడితో సంగీతాన్ని జోడిస్తున్నాయి.ఆ పచ్చటి పొలాల్లో గల