ఆగమనం.....సిక్స్ ఫీట్ ముఖంలో, సంతోషం వచ్చేసింది!! అక్కని సైడ్ హాగ్, చేసేసుకుంటాడు!!ఈ హగ్స్ ఏమీ అవసరం లేదు గానీ... ఇంతకీ ప్లాన్ ఏంటో చెప్పు??బయటికి వెళ్ళాలి అక్క!! పొట్టిదానికి నాతో కలిసి బయట, తిరగాలని ఉంది!! కాసేపు దానితో, బయట తిరిగి వస్తాను!!నీ తమ్ముడు కోసం మేనేజ్ చేసుకో!!ఉమ్... తనతో కలిసి బయటికి వెళ్తాను అంటావు!!హా..... అని సాగదీస్తూ... చూస్తుంది!!అక్క నాతో ఆడుకోవాలని చూడకు!! తెలిసి కూడా చేస్తున్నావు!! ఆ పొట్టిది నాకు ఫోన్ నెంబర్... పంపిందని, నీకు తెలియదా??ఉక్రోషంతో టెన్షన్ గా చూస్తున్నాడు!!తమ్ముడు ఫేస్ చూసి... బిగించిన పెదవులు వదిలేసి... ఒక్కసారిగా నవ్వేస్తుంది!!సరే వెళ్ళు..!! ప్రాబ్లమ్ ఏం లేదు!! నేను, మేనేజ్ చేసుకుంటాను!!ఇంతకీ ఎక్కడికి వెళ్తారు?? తిరిగి, నువ్వు ఏ టైం కి వస్తావు??అసలు ఏమీ తెలియదు..!!వెళ్లాలి అంతే!!నేను నీకు ఫోన్ చేసి చెప్తా!!ఓకే నా...!!ఉమ్... అర్థమైంది ఓకే!! ఇంతకీ, తను ఎక్కడుంది??థాంక్యూ అక్క!! థాంక్యూ సో మచ్!! పొట్టిది, బయట ఎక్కడో చోట ఉంటుంది!! నేను, చూసుకుంటాలే!! బాయ్ అక్క.... బాయ్...అక్క, రెండు చంపల మీద గట్టిగా... ముద్దులు పెట్టేసి, మన