ఆగమనం.....పొట్టిది వెళ్ళిపోతున్న సిక్స్ ఫీట్ ని...అక్కడే నిలబడి నవ్వుతూ చూస్తుంది.అంతకుముందు తను మాట్లాడిన... నడి వయసు ఆవిడ దగ్గరికి వెళ్లి... కొన్ని నిమిషాలు ఆవిడతో, వాళ్ళ పాపతో గడిపి... అక్కడి నుంచి నేరుగా, కళ్యాణ మండపానికి వెళుతుంది!!తన సిక్స్ ఫీట్ ని, అలాగే మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ ని, వాళ్లతో పాటు మండపం మీద ఉన్న ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక కార్నర్ లో సెటిల్ అవుతుంది.పొట్టిది అలా కూర్చున్న రెండు నిమిషాలకే, జీలకర్ర బెల్లం పెట్టిస్తూ పురోహితుడు పురమాయించగా గట్టి మేళంతో మండపం అంతా ప్రతిధ్వనిస్తూంది.మధ్యన ఉన్న అడ్డు తెర తొలగగా... పీటల మీద ఉన్న వధూవరులు...తన మీద జీలకర్ర బెల్లంతో... తొంగి చూస్తున్న తెలియని తపనతో... ఇరువురి చూపులు కలిసినాయి!వరుడు కనులు మైమరుపుతో, పెద్దవి కాగ!వధువు కనులు చిలికిన సిగ్గుతో చిన్నవైనాయి!!పెదవులలో చేరిన చిరునవ్వుతో ఇరువురి...బుగ్గలలో, కెంపులు పూయ సాగాయి!!చూస్తున్న అందరికన్నులలో...సంతోషాలు విరియాసాగాయి!!పసుపు చందన సుగందాలు...రంగారించుకున్న, అక్షితలు!!అందరి మనసులు మురిసిన వేళ...ఆ భావోద్వేగాన్ని తమలో బంధించి!!కోటి ఆశలతో