స్క్రీన్ మీద వివేక్ నంబర్ కనిపించి ఆ టైంలో చేయడంతో ఇంపార్టెంట్ కాల్ అని బ్యూటీ బేబీస్ మధ్యన ఉన్న రానని పక్కకు లాగి వివేక్ మాట్లాడు అన్నాడు ఫోన్ చేతిలో పెట్టినా బామ్మర్ది గాడు, ఆ ముసలోడు ఏదో చెప్పుకుంటాడు అందుకే కాల్ చేశాడని అంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి పోయావా ఇంటికి అని అడిగాడు.ఆ ఇప్పుడే వచ్చాను అన్నాడు చిరాకుగా.మండుతున్నట్టుంది అని రాణా వెటకారం గా అడుగుతుంటేఒరేయ్ ఎందుకురా వాడిని కూడా డిస్టర్బ్ చేస్తావని సైడ్ నుంచి మేటర్ ఏంటో కనుక్కోమని అరుస్తున్నాడు ఉదయ్.పెట్రోల్ పోసినట్టు మండుతుంది బావ. ఈ డ్రైవర్ డ్యూటీ చేయడం నావల్ల కాదు. నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు.యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ బామ్మర్ది. బట్ ఒక్కటే కండిషన్ మీ అమ్మకి చెప్పి రా. మళ్లీ నీలాంటి ఉత్తమ కొడుకుని నేనేదో చెడగొట్టానని నా మీద పడుతుంది అంటూ కాల్ కట్ చేసిన అరగంటకి