ఆగమనం.....లేదురా, ఈగో గురించి కాదు!! ఆ అమ్మాయి గురించి కూడా కాదు!! నీ గురించే రా!! ఒకవేళ నువ్వు కూడా ఆ అమ్మాయిని... ఇష్టపడుతున్నావా!! అదేరా, ప్రేమించడం మొదలు పెట్టావా??అతని మనసులో అనిపించినది, బయట పెట్టాడు.మెట్లు దిగుతున్న వాడు, అలాగే నిలబడిపోయాడు!!అనాలోచితంగా అడిగాడో, ఆలోచించి అడిగాడో!! అడిగిన మాటలకు మాత్రం ఒక్క క్షణం... మన హీరో ఆలోచన ఆగిపోయింది!!వెంటనే అలర్ట్ అయ్యి, ఏమి మాట్లాడకుండా... కిందకు దిగిపోతున్నాడు!!ఏంటి రా, నిన్ను అడుగుతుంటే...అలా వెళ్ళిపోతున్నావు?? నీకేమనిపిస్తుందో చెప్పు?? అని వెంట దిగుతున్నాడు.దాని గురించి వదిలేయరా!! ఇంక మాట్లాడకు!! అని విసుక్కుంటూ, వెళ్తున్నాడు!!వదిలేయమంటే, అర్థం కాలేదు!! నీ ఆలోచన ఏంటో, చెప్తేనే కదరా తెలిసేది!! అంటూ, ముందుకు వచ్చి నిలబడ్డాడు!!వదిలేయమంటే, వదిలేయ్యమనే!! ఇప్పుడు అది అవసరం లేని విషయం!! మనకు చాలా పనులు ఉన్నాయి!! ముందు మండపానికి వెళ్లాలి, పద వెళదాం!! అంటూ, ఆ మ్యాటర్ అక్కడితో కట్ చేసి... ఫ్రెండ్ ని తీసుకొని వెళ్ళిపోతాడు.మండపనికి వెళ్లడం, అక్కడ పనులు చూసుకోవడం, తిరిగి ఇంటికి రావడం, ఇంట్లోని హడావిడితో... అంత బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.పచ్చటి తోరణాలతో, కళకళలాడుతున్నా, పెళ్లికూతురు ఇంట