ఆగమనం.....మన హీరో పిట్ట కథలాగా చెప్పిన పొట్టి దాని ప్రేమ కథ విన్న ఫ్రెండ్స్ ఇద్దరు నోర్లు వెళ్లబెట్టి, గుడ్లు బయటపెట్టి...సిమ్ కార్డు పీకేసిన సెల్ ఫోన్స్ లాగా దర్శనమిస్తున్నారు!విన్న వాళ్ళ పరిస్థితే అలా ఉంటే!!ఫేస్ చేసిన మన హీరో పరిస్థితి, ఈ మాత్రం ఉండొచ్చు!!ఫ్రెండ్స్ ఇద్దరి పరిస్థితి చూసి... మన హీరో... ఇద్దరికీ చెరోక, డిప్ప కాయ ఇచ్చాడు!!ఇద్దరు తేరుకొని, మన హీరోని ఏగదిగా చూస్తున్నారు!!ఒరే బావ నువ్వు చెప్పింది వింటుంటే.. చిన్న సైజు రొమాంటిక్ మూవీ, విత్ యాంగ్రీ బర్డ్ లా ఉంది!!ఏంట్రా నీకు అంత వెటకారంగా ఉందా, నా కోపం చూస్తుంటే.!!లేదు బావ!! వెటకారం కాదు, ఆ పిల్ల చేసిన దానికి, నీకు కోపం రావడం కరెక్టే!! నేను 100% నీకు సపోర్ట్ చేస్తున్న!! కాని అలా కాదురా, అసలు ఆడపిల్లలు ఇంత అడ్వాన్స్ ఎప్పుడైపోయారు?? పబ్లిక్ ప్లేస్, లిప్ కిస్, అలా మీదకి ఎక్కేసి.... వామ్మో, వామ్మో