ఎపిసోడ్ - 1 [ ఓ నిశ్శబ్ద ప్రయాణం ]"ఒక నిమిషం కొన్ని గంటల కథలు మోసుకెళ్లింది…ప్రతి మాట ఒక కవితను పలికింది…కళ్ళల్లో కనిపించేది చూపు మాత్రమేననివెన్నెల నీడలో నీ... నా ప్రేమ దాగింది."కృష్ - ప్రియాఇద్దరూ రాత్రి బీచ్లో నడుస్తున్నారు. చుట్టూ మొత్తం నిశ్శబ్దం… ఎలాంటి మాటలు లేవు. దూరంగా చంద్రుడు… చుట్టూ చల్లటి గాలి… అప్పుడప్పుడూ కాళ్లను తాకి వెళ్లే అలలు.నచ్చిన మనిషి ఇంత దగ్గరలో ఉండగా, కృష్ కళ్లను ప్రియా చూస్తోంది… ప్రియా కళ్లను కృష్ణ చూస్తున్నాడు. కానీ ఏమి మాట్లాడుకోలేదు. ఒక నిమిషం మౌనం మాత్రమే ఉంది.ఆ ఒక రాత్రి… ఆ ఒక నడక… మొత్తం మార్చేసింది.ప్రియా: కృష్… ఈ రోజు స్పెషల్ ఏంటో గుర్తుందా?కృష్: అబ్బా! ఇంత స్పెషల్ డేని నేను ఎలా మర్చిపోతాను? ఈ రోజే నేను నిన్ను మొదటిసారి చూశాను... నిన్ను చూసిన దానితోపాటు, నీ పైన నాకూ ప్రేమ కలిగిన