ఒకానోనా సమయంలో ఒక ధనవంతుడైన నగల వ్యాపారి ఉండేవాడు. అతనికి నలుగురు భార్యలు.ఆ వ్యాపారికి తన నాల్గవ భార్య అంటే అందరికంటే కూడా ఎక్కువ ఇష్టం ఉండేది తాను చాలా అందంగా ఉండేది. తాను స్వయంగా తయారు చేసిన విలువైన ఆభరణాలని తనకి అలంకరించేవాడు. చాలా విలువైన బట్టలను ఇచ్చేవాడు. తాను ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే నాల్గవ భార్యని తీసుకెళ్లి అందరికి గర్వంగా చూపించుకునేవాడు దానితో ఆమెకి తాను చాలా అందగత్తె అని గర్వం పెరిగింది. నాల్గవ భార్య తరువాత అందంగా ఉండేది తన మూడవ భార్య. తరువాత మూడవ భార్యని కూడా ప్రేమించేవాడు. ఈమె కూడా అందంగా ఉండేది. ఆమెకి కావలసినవన్నీ కొని పెట్టేవాడు. ఆమెకి వివిధ రకాలైన ఆహరాన్ని తింటూ ఎంజాయ్ చేయడం చాల ఇష్టం . నగల వ్యాపారి వివిధ ప్రాంతాలలో పెరిగే రకరకాల పండ్లను ఆమె కోసం తెప్పించేవాడు.ఆ ఇద్దరి భార్యలంతా అందంగా ఉండకపోయినా రెండవ భార్య