నమ్మక ద్రోహం

  • 183
  • 57

నమ్మిన వారిని ద్రోహం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ఒక వ్యక్తి మనల్ని నమ్మారంటే ఎట్టి పరిస్థితుల్లో దానిని వమ్ము చేయకూడదు. నమ్మకద్రోహం చేసిన వ్యక్తి ఎంతటి శిక్ష ఎదుర్కొంటాడో చెప్పే ఒక నీతి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   నమ్మకం మరియు మోసం అనే అంశంపై నీతి కథ: ఒక రోజు ఓ వేటగాడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అదే సమయంలో అతనికి ఓ పులి కనిపిస్తుంది. పులి నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఉన్న చెట్టుపైకి ఎక్కుతాడు. అయితే అప్పటికే ఆ చెట్టుపై ఓ ఎలుగుబంటి పడుకుని ఉంటుంది. ఎలుగుబంటిని చూసిన ఆ వేటగాడు.. 'పులి నన్ను చంపాలని చూస్తోంది. దయచేసి నాకు చోటు కల్పించు' అని రెండు చేతులు జోడించి వేడుకుంటాడు. దీంతో కనుకరించిన ఎలుగుబంటి సరే అని చెప్తుంది. ఇంతలోనే చెట్టు కింద ఉన్న పులి, ఎలుగుబంటితో మాట్లాడుతూ.. 'ఆ మనిషి మన ఇద్దరికీ శత్రువు. అతన్ని కిందికి తొసేయ్‌ ఎంచక్కా