నీ ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయేలా చేయగలిగావు అనుకుంటున్నావ్ కదా.. ప్రపంచం చాలా పెద్దది.. ఒక్కసారి నీకు దూరంగా వెళ్ళనివ్వు.. నువ్వు గుర్తులేనంతగా నిన్ను మర్చిపోయేలా చేస్తుంది... ************అజయ్ ప్రేమిస్తుంది మిత్రాని. రోజు చూస్తున్నాం కదా, ఆకాశం మన సొంతం అనుకుంటే ఎలా? రోజు కనిపిస్తుంది కదా, చందమామ మనదే అనుకుంటే ఎలా?అజయ్ ప్రేమ విషయం తెలిసాక... నేను ఎంత దూరం ఆలోచించానో అనిపించింది. పిచ్చి మనసు.. స్నేహానికి, ప్రేమకి వ్యత్యాసం తెలుసుకోలేకపోయింది. అయిన అజయ్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని చెప్తే .. నేను తిరిగి ప్రేమించే పరిస్థితి మా ఇంట్లో లేదు.. ఒక విధంగా ఇలా జరగడం కూడా నా మంచికే..ఎప్పటిలానే కాలేజీకి వెళ్ళాను. అందరూ ఫ్రెషర్స్ డే హడావిడిలో మునిగిపోయి ఉన్నారు. రేపే ఫ్రెషర్స్ డే.. అప్పుడే నేను కాలేజీ జాయిన్ అయ్యి 2 మంత్స్ ఐపోయాయి అంటే ఇంకా నమ్మకం కలగడం లేదు."ధీర, ఏం ఆలోచించావ్?" దివ్య అడిగింది. "దేని గురించి దివ్య" ముందు వాళ్ళు