మన్నించు - 5

ప్రేమ మొదట్లో చాలా అందంగా ఉంటుంది. కొంత దూరం కలిసి నడిచాక, ఈ ప్రేమని ఎలా ఆపేయాలో తెలీదు, ఇంకొంచెం ముందుకు వెళ్తే వెనక్కి రాగలమో లేదో తెలీదు, అక్కడే ఆగిపోతే ఏం అవుతుందో కూడా తెలీదు. ప్రేమ ఏడారిలో ఎండమావి లాంటిది.. దాహం తీర్చుకోవడానికి వెళ్ళి ఊబిలో ఇరుకుపోయేలా చేస్తుంది. **********************క్లాసెస్ ఐపోయాయి.. ఎప్పటిలానే పార్కింగ్కి వెళ్ళి సైకిల్ బయటకి తోసుకుంటూ వచ్చాను. అందరినీ ఇప్పుడే వదిలారు కదా, రోడ్ మొత్తం జనాలే... కాలేజ్ రోడ్ సందు చివరి వరకు తోసుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి తోకుకుంటూ వెళ్లోచులే అని స్లోగా సైకిల్ తోస్తున్న. "హాయి ధీర" అంటూ పలకరించాడు సిడ్. తల పక్కకి తిప్పి చూసాను. ఎప్పుడులా అనిపించలేదు. ఏంటో బాగా టెన్షన్గా వున్నట్టు అనిపించాడు. చెమటలు కారుతూ, అటూ ఇటూ చూస్తూ... ఏం అయిందో తెలీడం లేదు గానీ ఏదో అయింది. "ఏం అయింది. ఎందుకు అలా ఉన్నావ్?" "చిన్న హెల్ప్ కావాలి" "ఏం అయిందో