మన్నించు - 4

  • 111

మనం అనే బంధంలో .. నేను అనే స్థానం మాత్రమే శాశ్వతం. నువ్వు అనే స్థానంలో ఈ రోజు నువ్వు వుండుండొచ్చు, రేపు ఇంకెవరో ఆ స్థానాన్ని స్వాధీనం చేసుకోవచ్చు..********"ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్లో నేను డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను." దివ్య ప్రతీదాన్లో చాలా ఫాస్టుగా వుంటుంది. "అందరం ఒకే కలర్లో డ్రెస్ వేసుకుందాం" శ్రీస్తి ఎక్సైట్మెంట్గానే వుంది. "అదే బాగుంటుంది.. ఏం అంటావ్ ధీర?" మిత్ర మాటలకి అందరూ నా వైపు చూసారు. "నేను రాను అనుకుంటా .... నాకు ఆ రోజు వేరే ప్లాన్స్ ఉన్నాయి" మొన్న అజయ్ తో బైక్ మీద వెళ్ళక తను ఇంక కనిపించలేదు. కాలేజీకి కూడా రాలేదు రెండు రోజుల నుంచి. ఏం అయ్యుంటుంది అని ఒకటే ఆలోచన.... మిత్రని అడుగుతే ఏం అనుకుంటుందో... అడగకపోడమే మంచిది. "ఈ మధ్య ఇలానే వుంటుంది పరధ్యానంగా..." దివ్య అంటుంటే మళ్ళీ ఆలోచనలలో నుంచి బయటకి వచ్చాను. ఇంకో రోజు గడుస్తోంది.... అజయ్ క్లాస్ వైపు