మన్నించు - 3

  • 585
  • 195

రోజులు మారేకొద్ది ఇష్టాలు మారిపోతుంటాయి. చిన్నప్పుడు ఇష్టం అయిన రంగు, రుచి, ప్రొఫెషన్.. ఏది ఇప్పుడు నచ్చవు. కాలంతో పాటు చాలా మారిపోతుంటాయి... ప్రేమించిన వ్యక్తి మీద ఇప్పుడు వున్నంత ఇష్టం ఇక ముందు కూడా అలానే వుంటుంది అనేది మనకి మనమే చెప్పుకునే నిఖార్సయిన అబ్బాధం. జీవితం అనే పెద్ద అబద్ధం ముందు ప్రేమ అనే చిన్న అబద్ధం కూడా అబ్బాధమే అని ఎవరూ కనిపెట్టలేరు. ----------------------------------------------------------------------------"నా పేరు సిద్ధార్థ్. అందరూ సిడ్ అని పిలుస్తుంటారు. డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నువ్వు నాకు నచ్చావు. నిన్ను చూసినప్పటి నుంచి ఇంకా చూస్తూ ఉండాలి అనే ఫీలింగ్. మా ఇంట్లో అందరికీ ఒకే... నీకు ఒకే ఐతే మనం ప్రేమించుకుందాం" అజయ్ చెప్పాడని మొన్న సీన్ క్రియేట్ చేసిన అబ్బాయిని పలకరిద్దాం కథ అనుకుంటే.. ఇలా డైరెక్ట్గా ప్రపోజల్ పెట్టేశాడు. నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. నా పక్కన ఉంటూ ఇది అంతా