ప్రేమ ఒకరి మీదే పుట్టి ఒకరితోనే ఆగిపోవాలి అని లేదు అన్నప్పుడు, మనతోనే ప్రేమ ఆగిపోవాలని ఏం వుంది? మనం మొదటి ప్రేమ కానప్పుడు మనమే చివరి ప్రేమ అవ్వాలని మాత్రం ఏం వుంది? మనం లేకపోతే వాళ్ళ జీవితం ఆగిపోతుంది అని మాత్రం అనుకోడం మన తప్పు. తను లేకపోతే నేను ఏం ఐపోతానో అనుకోడం ఒక అపోహ. ---------------------------------------------------------------------"అమ్మ నేను మొన్న కొన్న డిజైనర్ డ్రెస్ వేసుకొని వెళ్త కాలేజీకి" స్నానానికి వెళ్తూ మా అమ్మకి చెప్పాను. "సరే నీ ఇష్టం" మా అమ్మ ఇంత ఈజీగా ఒప్పుకుంటుంది అనుకోలేదు. ఈ రోజు అందరికన్నా నేనే అందంగా కనిపిస్తాను. స్నానం చేసి ముచ్చటగా కొనుకున్న డిజైనర్ గౌన్ వేసుకున్న. అబ్బా ఎంత అందంగా ఉందో ఈ డ్రెస్ నాకు. "అమ్మ జడ వేయు. కాలేజీకి లేట్ అవ్తుంది." మా అమ్మని పిలుస్తూ టిఫిన్ తిండానికి కూర్చున్నాను. మా అమ్మ బెడ్ రూంలో నుంచి వస్తూ దువ్వెనతో