మన్నించు - 1

  • 939
  • 291

జీవితం చాలా చిన్నది. అంత చిన్న జీవితంలో పుడుతూ చచ్చిపోతున్న ప్రేమ ఇంకెంత చిన్నదో కదా. అలాంటి ప్రేమ కోసం ఎందరో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకెందరో రాజీపడి మర్చిపోయి ముందుకు సాగిపోతున్నారు. గానీ కొన్ని కథలు ఈ రెండిటికీ మధ్య ఎక్కడో ఇర్రుకుపోతాయి, బయటపడలేని అగాధంలో చిక్కుకుపోతారు. -------------------------------------------------------------------------------------------2013, ఇంటర్ చదువుతున్న రోజుల్లో..."మా అమ్మాయికి డాక్టర్ చదవాలనే కోరికతో ఉంది, కొంచం ఈ సర్టిఫికెట్లు చూడండి." మా నాన్నగారు నా  పదో తరగతి మార్కుల సర్టిఫికెట్ చూపిస్తూ గొప్ప ఆనందపడ్తూ, గర్వంగా చెప్పారు. "9.0 పాయింట్స్.... మ్మ్.. " తల అడ్డంగా ఉపుతూ నా వైపు చూసారు డెస్క్లో వున్న అతను. భయపడుతూ చిన్నగా నవ్వాను. "అమ్మాయికి ఒకసారి కౌన్సెలింగ్కి పంపించండి." అని చెప్పి పక్కగా వున్న ఒక డోర్ వైపు చూపించారు అతను. మా నాన్నగారు సందేహంగా చూస్తూ "కౌన్సెలింగ్ ఎందుకు అండి, మేము బై. పి. సి అనే అనుకుంటున్నాం" అన్నారు. "కౌన్సెలింగ్ కంపల్సరీ అండి.