వసంతకేళి –హోళి!

  • 213
  • 69

వసంత ఋతువు ఆగమనం మనుషులలో ఉత్సాహమే కాదు ప్రకృతిలో సరికొత్త సొగసు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి, పూలు పూస్తాయి. కోయిలలు తమ కమ్మని కంఠంతో వీనుల విందు చేస్తాయి. మల్లెలు సువాసనలు వెదజల్లుతూ గుబాళిస్తాయి. ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంతఋతువు ప్రవేశించిన తర్వాత జరుపుకునే తొలి వేడుక హోళి.ప్రపంచంలోని రంగులన్నీ ఒకచోట కుప్ప పోశారా అన్నంత అందంగా, ఆహ్లాదంగా జరిగే హోళీ అంటే చిన్నా పెద్దా అందరికీ ప్రియమే! వయోభేదం, ఆడా, మగా అన్న తేడా లేకుండా అందరూ కలిసి ఓ పండుగలా జరుపుకునే హోళీ వివరాలు...హోళీ ఎప్పుడు ప్రారంభమయిందంటే.... హోళీ పండుగ ఈనాటిది కాదు. ద్వాపర యుగంలోనే ఈ పండుగ జరుపుకున్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. తన నెచ్చెలి రాధ తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తల్లి యశోద దగ్గర వాపోతాడు. అప్పుడు యశోద కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. రాధ శరీరం నిండా రంగులు