మనసిచ్చి చూడు.....16ఆ ఫోన్ కళ్యాణ్ నుంచి రావడం మధుకి చాలా భయం వేసింది.మధు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎన్ని సార్లు చేస్తున్నా స్క్రీన్ చూస్తూ ఉంది.మెసేజ్ చేశాడు.మర్యాదగా ఫోన్ ఎత్తు అని.చూసి సమాధానం ఇవ్వలేదు.కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది.36 గంటల ప్రయాణం తరువాత మమత గారు,గౌతమ్ మధుని చూడడం చాలా బాధతో కూడిన సంతోషం వచ్చేసింది.ఎందుకు మధు ఇలా చేశావు మీ మామయ్య ఏరీకోరి చాలా మంచి సంబంధం చూశారు,అందరి పరువు తీసి వచ్చేశావు ఎందుకు తల్లి,నువ్వు ఏమీ చేసిన కారణం ఉంటుంది కానీ మాకు చెప్పలేనంతా కారణం ఏంటి అంది.వెంటనే గౌతమ్ అందుకొని అత్తయ్య ఇప్పుడే కదా వచ్చింది ఇంటికి వెళ్లక అన్ని మాట్లాడుకుందాము ముందు ఇంటికి పదండి అత్తయ్య.సరే గౌతమ్ అవును మధు నీ స్టమక్ ఎందుకు కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది.డైటింగ్ చేస్తావ్ కదా మళ్ళీ ఏంటి మధు ఇది అంది.ఏమి సమాధానం చెప్పలో తెలియక ఈ మధ్య