మనసిచ్చి చూడు - 15

మనసిచ్చి చూడు.....15 ఏ....ఎంత ధైర్యం ఉంటే నా మీదే చేయి చేసుకుంటావు అన్నాడు కళ్యాణ్.నోటిలో నుంచి ఇంకొక మాట వచ్చిన నీ నోరు పని చేయదు జాగ్రత్త అన్నాడు గౌతమ్.అప్పుడే అక్కడికి సమీరా రావడం ఇద్దరు గమనించి ఏమీ జరగనట్టు ఉన్నారు.అత్తయ్య పిలుస్తున్నారు మిమ్మల్ని అంది.బాబు గౌతమ్ సమీరాకి ఇప్పుడు ఐదో నెల కదా సీమంతం చేయాలి అనుకుంటున్నాము,రేపు మీరు అమెరికా వెళుతున్నారు అంటా కదా ఈరోజు పూజారి గారితో మాట్లాడాను,మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అంది.సరే అత్తయ్య మీ ఇష్టం నేను కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అని బయటికి వెళ్తాడు.సాయంత్రంకి అన్ని ఏర్పాట్లు జరుగుతు ఉంటై పాపం మధుకి కూడా సీమంతం మీద ఆశ ఉంటుంది కదా.ఎవరు లేకుండా అక్కడ ఒక్కటే ఎన్ని కష్టాలో పడుతుందో ఏంటో చాలా బాధ పడ్డాడు గౌతమ్.ఎంతో గ్రాండ్గా ఫంక్షన్ జరుగుతున్న సమీరా మైండ్లో వాళ్ల ఇద్దరి సంభాషణ తిరుగుతూ ఉంది.అసలు కళ్యాణ్