మనసిచ్చి చూడు - 14

  • 210

             మనసిచ్చి చూడు.....14కళ్యాణ్ కాల్ చేసి బావ మీరు ఈరోజు ఇంటికి రండి భోజనానికి అంది.కానీ నా వైఫ్ ఇక్కడ లేదు సమీరా,ఇద్దరం కలిసి ఇంకోసారి వస్తాములే అన్నాడు.నో బావా తనతో మళ్ళీ రావచ్చు నువ్వు అత్తయ్య మామయ్య రండి అంది.సరే సమీరా వస్తాము అన్నాడు.భోజనానికి చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంది అది గమనించి ఉమా గారు ఎవరు వస్తున్నారు సమీరా అంది.మా బంధువులు వస్తున్నారు అత్తయ్య అందుకే అంది.గౌతమ్కి తెలుసా వాళ్ళు వచ్చేది అని అడిగింది.లేదు అత్తయ్య నేను వెళ్ళి చెప్పి వస్తాను ఉండండి అని గదిలోకి వెళుతుంది.ఏవండీ అంటుంది....!!చెప్పు సమీరా ఏమైనా కావాలా అంటాడు.లేదు కాసేపటిలో మా బావ వాళ్ళు ఇంటికి వస్తున్నారు మీకు ఒకే కదా అంది గౌతమ్ని గమనిస్తు...??ఒకే రానివ్వు కానీ ఎవరూ అన్నాడు.కళ్యాణ్ మా బావా వాళ్లు అంది.గౌతమ్ మొహం ఒక్కసారిగా ఎర్రగా అయిపోయింది.ఏ ఊరు మీ