మనసిచ్చి చూడు - 12

  • 237

మనసిచ్చి చూడు.....12అసలు ముందు ఎవరో చెప్పు మధు అన్నాడు గట్టిగా...!!బావ అతని పేరు కళ్యాణ్ ,అమెరికా లోనే జాబ్ చేస్తున్నాడు అంది.ఎలా పరిచయం అన్నాడు.బావా నిజం చెప్పాలి అంటే నువ్వు సమీరాను చేసుకున్నా నెల తరువాత నాకు పెళ్ళి జరిగింది బావ.ఎప్పటి నుంచి నీకు పరిచయం అన్నాడు....??బావ అసలు ఒక నెలలోనే ప్రేమ పెళ్ళి అన్ని అయ్యాయి.మొదట నేను ఒప్పుకోలేదు కానీ అతను చూపించే అతి ప్రేమకు ఒప్పుకోక తప్పలేదు బావ అంది.నీకు ఏమైనా పిచ్చి పట్టిందా సమీరా అంత పెద్ద దేశంలో ఉండి,మంచి ఉద్యోగం చేస్తూ ఆలోచన శక్తి లేకుండా ఇలా ఎలా చేశావు అన్నాడు.బావ ఆలోచన శక్తి లేక కాదు,ఏ సమయానికి ఎవరికి ఎలా ప్రేమ పుడుతుందో తెలియదు కదా,అలానే నా పరిస్థితి కూడా,అప్పటికీ మీ అందరికీ చెప్పి పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ కళ్యాణ్ ఇప్పుడే చెప్పకు అన్నాడు అంది.ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఏమ్ జరుగుతుందో అర్థం