"అమ్మా వెళ్ళొస్తా! అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయలు దేరింది రూప". జాగ్రత్తమ్మా! అంటూ ఆమె వెనుకే వచ్చి.. గేట్ దగ్గరకేసి.. రూప వైపే చూస్తూ కాసేపు అక్కడే నిలబడింది రూప వాళ్ళమ్మ రాజ్యలక్ష్మి .. రూప మాత్రం అడుగుల వేగాన్ని పెంచి, వీలైనంత తొందరగా ఈ నాలుగిళ్ళు దాటి పోవాలి, అన్నట్టు నడుచుకుంటూ మెయిన్ రోడ్ వైపు వెళ్తుంది. కానీ రోజూ లాగా ఆ కాలనీలో వాళ్లు , ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి.. రాజ్యలక్ష్మి గారుండే ఇంటికి పక్క వీధిలో ఉన్న జగన్నాధం...తన భార్య తో.."విమలా అబ్బాయి బయలు దేరిన ఫ్లయిట్ కరెక్ట్ టైమ్ కే వస్తుందట. ఐదుగంటలకల్లా ఇంట్లో ఉంటానని, ఫోన్ చేసాడు' అని పెద్దగా చెప్తున్నాడు." అరె ఎన్ని సార్లు చెప్తారండీ.. వాడు నాకు గంట ముందే ఫోన్ చేసాడు.నన్ను ముందు వంట చేయనివ్వండి" అంటూ తన పనిలో ఉంది విమల...సాయంత్రం ఐదు గంటలకే విశ్వ తేజ వచ్చిన కారు