సమయం ఉదయం పది గంటలు....ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలోని తన ఛాంబర్ లో కూర్చుని ఇందాక తను చూసిన విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సిద్దార్థ్.... ఆలోచించేకొద్దీ తన మనసు బాధతో నిండిపోతోంది... ఎందుకిలా జరిగింది? జాహ్నవి ఎందుకిలా మారిపోయింది? కాలేజ్ లో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేది... చూసేకొద్దీ మరీ మరీ చూడాలనిపించేది.... అప్పట్లో కాలేజీలో ప్రతి అబ్బాయికి తనే డ్రీమ్ గర్ల్.... తమ వైపు జాహ్నవి ఒకసారి చూస్తే చాలు అనుకునేవారు అందరూ....అలాంటిది ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.... ముఖమంతా గుంటలు పడిపోయి, కళ్ళు లోపలకి పీక్కుపోయి, ఒంట్లోని సత్తువ ఎవరో లాగేసినట్టుగా సన్నగా అయిపోయింది.... ఎంత ఆలోచించినా జాహ్నవి ఎందుకలా మారిపోయిందో సిద్దార్థ్ కి అర్థం కాలేదు....ఎంతసేపటికీ ఆలోచనలు తెగకపోవడంతో ఎలాగైనా సాయంత్రం జాహ్నవితో మాట్లాడాలని నిర్ణయించుకుని పనిలో మునిగిపోయాడు సిద్దార్థ్......**************సిద్దార్థ్ సినిమా హీరోలా ఆరడుగుల అందగాడు అని చెప్పలేకపోయినా వాళ్లకు ఏ మాత్రం తీసిపోడని మాత్రం చెప్పచ్చు....