చూపులు కలిసిన శుభవేళా

  • 639
  • 1
  • 216

ఏమైందమ్మా!ఎక్కడినుంచి ఫోన్.?అంతా ఒక్కచోట చేరేరు,అల్లుడు కొత్తకోరిక ఏమైనా....అరుగుమీద కళ్లనీరు నింపుకున్న సుధ,అక్క మాటలు వింటూనే లోపలికి పరుగున వెళ్ళిపోయింది.మొదటినుంచీ ఏదో పేచీనే!అత్త ఒకలా,ఆడపడుచు ఇంకోలా,ఎవరు ఎలా ఉన్నా సర్దుకోవచ్చు పెద్దా!ఇపుడు కాబోయే మొగుడు కూడా ఇలా ఏదోటి తప్పులు చెప్తూ...పరిహారంగా లిస్ట్ పెంచుతున్నారు... రికార్డ్ చేసింది వినిపించింది.ఇదేమైనా భారతమా అమ్మా వినడానికి..అందుకే నేను ఈ లంపటం వద్దన్నది...ఈవిడ మాత్రం నూరేళ్ళ పంట అంటూ ఏవో సూక్తులు చెబు..అందరూ ఒకేలా ఉండరక్కా!ఆయన చాలా మంచివారు గదిలోంచి బయటకు వచ్చింది.పౌరుషరథాన్ని అటు తిప్పు సుధా!నువ్వే మాట్లాడుకో ,ఎం లోటు పాట్లు వచ్చాయో,వస్తాయో కూడా తెలుసుకో!చూడబోతే అత్తగారిల్లు పండితుల నిలయంలా ఉంది నవ్వింది మైధిలి.అక్కా!అనవసరంగా ఎందుకు మాట అనుకోవడం?ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుకుంటే సరి..అది నువ్వు,నీ ఇంటివారూ చూసుకోండి!మేము అంతా బాగానే చేశాం,తాహతుకుమించి కూడా చేశాం..ఇరవై అని పెళ్లికి వచ్చినట్టు బస్ నిండా వచ్చేరు నిశ్చితార్థానికే!అప్పటికప్పుడు భోజనాలు,గిఫ్టులు,మీ వదినకు ఈ కంగారులోనే ఉంగరం కావాల్సి వచ్చిందట..ఎంత