ఊహించని సంఘటనలు జీవితంలో చోటు చేసుకోవడం, నా అన్న వాళ్ళు వదిలెయ్యడం ప్రణతికి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న నిజాన్ని తెలిసేలా చేసాయి. కేసు విచారణ తరవాత ప్రణతికి మూడు సంవత్సరాల జైలు శిక్ష వేసింది న్యాయస్థానం’ఇంటి దగ్గర లేటయింది’ అంది ప్రణతి. ’వీళ్ళకేం తెలుసు, నేను ఇక్కడికి రావడానికి ఎంతగా పోరాటం చేసానో’ అనుకుంది మనసులో. ’అందరితో పాటూ వస్తే స్పెషల్ ఏముంది? అందరినీ కలిపి రాగింగ్ చేసేస్తాం, క్లాసులకి పంపేస్తాం. ఇలా సెపరేట్‍గా వస్తేనే ఈమెని స్పెషల్‍గా రాగింగ్ చెయ్యచ్చు. ఆ ఛాన్స్ మనకిద్దామనే ఈ పాప లేట్‍గా వచ్చింది. కదా పాపా?’ వంకరగా నవ్వుతూ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్. అతన్ని చూసి అక్కడున్న వాళ్ళ కళ్ళల్లో బెదురుని చూసింది ప్రణతి. అప్పటివరకూ అక్కడున్న అమ్మాయిలు, అబ్బాయిలు జూనియర్స్‍ని సరదాగానే రాగింగ్ చేశారు తప్ప ఇబ్బంది పెట్టలేదు. వినోద్ అక్కడికి రావడం అక్కడ ఎటువంటి పరిణామలు సంభవిస్తాయో అని వాళ్ళలో జంకు కలిగింది. వినోద్