సున్నుండలడబ్బా

 కిరణ్ అనే కుర్రవాడు కలపాడు అనబడే గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. వాడంటే వాళ్ళ అమ్మకు అమితమైన ప్రేమ, వాడికి ఏమి కావాలో అవి కోరగానే తెచ్చి పెడుతూ ఉంటుంది. వాడి ఇంటర్మీడియట్ పరీక్షలు అవ్వగానే పై చదువులు నిమిత్తం పట్నం వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళమ్మకు మాత్రం ఇకపై తనబిడ్డ దూరంగా ఉండబోతున్నాడనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. కానీ కిరణ్ తప్పనిసరిగా పై చదువుల నిమిత్తం పట్నం చేరుకోవాల్సి వస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు తన బిడ్డ బాగా గుర్తొచ్చి ఆ తల్లి తన కొడుకును చూసొద్దామని అనుకుంటుంది. దీనితో పాటు కిరణ్కి పది రోజులు కాలేజ్ కి సెలవివ్వడంతో ఆమె కిరణ్ దగ్గరకి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది. ఆమె వెళ్తూ వెళ్తూ కిరణ్ కి ఇష్టమైన సున్నుండలను తయారుచేసుకుని వెళుతుంది.ఆమె అక్కడికి వెళ్లగానే నగర జీవితానికి అలవాటు పడిన తన కొడుకును మరియు తన కొడుకులో వచ్చిన మార్పును