కనిపెంచిన అమ్మను కాదను.. అమెరికా వెళ్లి.. అక్కడే సెటిలైన కొడుకు చివరకు అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాల్సి వస్తే..? మలి వయసులో అమ్మను ఒంటరిగా వదిలేశాడా..? లేదా అమెరికానా..? కనిపెంచిన అమ్మ ప్రేమను గుర్తుకు తెచ్చుకోవడం కోసం, కన్నతల్లిని ఆనందంగా ఉంచడం కోసం ‘మాతృదినోత్సవం’ నిర్వహించుకుంటున్నాం. నవ మాసాలూ మోసి, కంటికి రెప్పలా కాపాడిన అమ్మపై గౌరవాన్ని ఒక్కరోజుకు పరిమితం చేయలేం. కానీ ఉరుకులు, పరుగుల జీవితంలో తల్లిదండ్రులతో గడిపేందుకు తగిన సమయం కేటాయించలేకపోతున్నాం. వృద్ధాప్యంలో వారి ఆలనాపాలనా చూడలేకపోతున్నాం. మరి మనం చేసేది కరెక్టేనా..? కానీ ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ ఇది. యథాతథంగా మీకోసం..‘‘ ఈ మధ్య ఒకానొక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను. ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్నారైల తల్లితండ్రులు. నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి. వృద్ధాశ్రమంలో తమ తల్లి తండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు. ఇక్కడున్న చాలా మందికి పెద్దపెద్ద ఇళ్ళు, కొందరికి పొలాలు, ఆస్తులూ