ప్రపంచం చాలా చిన్నది. ఎక్కడో ఎప్పుడో చూసిన ఆ రూపం మళ్ళీ ఎదురుగా వచ్చిన ఈ క్షణం నాకోసమే అన్నట్టు అనిపిస్తుంది. ఏం అల్లరి గాలి ఇది నన్ను కుదురుగా వుండనివ్వట్లేదు. ఏం తుంటరి వాన ఇది నాలో కొత్త ఆశలు పుట్టిస్తోంది. ఈ వాతావరణ ప్రభావం నా నరాలని పట్టి లాగేస్తుంది, ఊపిరి వేడెక్కి పోతుంది, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆమె కి కూడా అదే విధంగా ఉందా???? అని తెలుసుకోవాలని మనసు తపన పడుతుంది.అసలు ఆకాశం ఒక్కసారిగా ఎందుకు ఉరిమింది. ఇద్దర్ని ఎందుకు ఒక చోటుకి చేర్చింది. అబ్బా!!! తన కళ్ళెంటి అంతలా నన్ను ఆకర్శిస్తున్నాయి, చూపు తిప్పుకోలేకపోతున్నానే......అమ్మాయి!!! అలా నవ్వకు, నీ అందం రెట్టింపు అవుతుంది, నా కోరిక ఇంకా బలపడుతుంది. ఈ వర్షం ఆగేనా నా కోరిక చల్లారేన, ఏంటి దేవుడా!!! ఈ అగ్నిపరీక్ష.వాన ఎక్కువయ్యేకొద్ది ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గుతూ వస్తుంది. చలి ప్రభావం