నేను బ్యాంక్ జాబ్ కి కోచింగ్ తీసుకుని బాగా కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్న. మొదటి సారి ఇంటర్యూ కి వెళ్తున్న. అమ్మ దేవుడికి దండం పెట్టుకుని పో అన్నది. దండం ఏంటి దేవుడినే తోడుగా తీసుకుపోతా అని దేవుడి ఫోటో తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని బయలుదేరాను. ఆటో ఎక్కాను.ఫేస్ కి స్కార్ఫ్ కట్టుకున్న. సిగ్నల్ దగ్గర ఆటో ఆగింది. ఆటో పక్కన బైక్ ఆగి ఉంది. అతను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. అతని ఫాంట్ జేబు నుండి పర్స్ జారిపోతుంది. అది చెప్పేలోపు బైక్ ముందుకు పోనిచ్చాడు నేను ఆటో ఆపి ఆ పర్స్ తీసుకుని వీలైతే ఆ ఆటోని ఫాలో అవ్వండి అన్న. ఫాలో అవుదామని చూసాడు. మధ్యలో చాలా వెహికల్స్ వెళ్లిపోయాయి. సరే అని నా ఇంటర్యూ ప్లేస్ కి వెళ్ళాను. ఇంటర్యూ బాగా జరిగింది. వాళ్ళని ఇంప్రెస్ చేసాను. అపాయిట్మెంట్ లెటర్ ఇచ్చారు.సంతోషంగా బయటకి